ఇంటర్‌ ఫలితాల విడుదలకు టైమ్‌ ఫిక్స్‌

హైదరాబాద్, మే 8 (విశ్వం న్యూస్) : ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ రిజల్ట్స్‌ను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు (మే 9వ తేదీన) ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డ్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయనున్నట్లు సమాచారం.

ఫలితాల వెల్లడిపై ఆదివారం అధికారులు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.inతో రిజల్ట్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

గత ఏడాది ఇంటర్ ఫలితాలల్లో ఏర్పడిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని.. ఈ సారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *