కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం
పట్ల నాయకులు సంబరాలు

వీణవంక, మే 13 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యుడు కర్ర భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల టపాసులు కాల్చి స్వీట్లు,పండ్లు, పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నుండి 136 మంది ఎమ్మెల్యేలను అక్కడి ప్రజలు ఆశీర్వదించారు. ఇదే తరహాలో రానున్న తెలంగాణ రాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన జూడోయాత్రలో ప్రతిఫలంగానే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది అన్నారు.
ఈ కార్యక్రమంలో సాహెబ్ హుషన్,రాజిరెడ్డి, మల్లారెడ్డి, అనిల్, యాదగిరి, కోమురాన్న, తిరుపతి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.