నిరుపేద వైద్య విద్యార్థికి మేయర్
జెవీఆర్ రూ.లక్ష ఆర్థిక సహాయం

పీర్జాదిగూడ, మే 18 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివేకానంద నగర్ లో నివాసం ఉంటున్న నిరుపేద విద్యార్థి గుమ్మడి విశాల్ తండ్రి గుమ్మడి వెంకటయ్య ఈ ఎస్ ఐ మెడికల్ కాలేజ్ జోకా కోల్కతాలో 3వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే వారిది నిరుపేద కుటుంబం కావడంతో కళాశాల ఫీజు, ఇతర ఖర్చులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడే సమాచారం అందుకున్న మేయర్ జక్క వెంకటరెడ్డి వైద్య విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో చదివి విద్యాబ్యాసం పూర్తి చేసి పేదలకు వైద్య సేవలాందించాలని కోరారు. ఈ సందర్భంగా మేయర్ కు విశాల్ తో పాటు కుటుంబ సభ్యుల అధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో తమ బిడ్డ భవిష్యత్ కు అండగా నిలిచినందుకు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మద్ది యుగేందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్,బీఆర్ ఎస్ పార్టీ నాయకులు మాడుగుల చంద్రారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, చెరుకు పెంటయ్య, రఘువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.