బ్రాహ్మణ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు

బ్రాహ్మణ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు

కరీంనగర్, జనవరి 8 (విశ్వం న్యూస్) : ఈరోజు కరీంనగర్ పట్టణంలోని విద్యుత్ ఇంజనీరింగ్ అసోసియేషన్ భవనంలో బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ కరీంనగర్ బాధ్యులు విద్యుత్ శాఖ ఎస్సీ గారైన గౌరవ శ్రీ కంకటి మాధవరావు అధ్యక్షత వహించారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు గారు మాట్లాడుతూ బ్రాహ్మణ క్యాలెండర్ డైరీ ఆవిష్కరించడం చాలా ఆనందదాయకమని గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎవ్వరు చేయనివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ నాయకత్వంలో బ్రాహ్మణులకు విద్యా ఉపాధి రంగాల్లో అవకాశం కల్పిస్తూ బ్రాహ్మణుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.. బ్రాహ్మణులు ఐక్యతగా కెసిఆర్ గారికి వెన్నంటి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారు బ్రాహ్మణ అభ్యున్నతికి అనేక సేవా కార్యక్రమాలు చేయడం సంతోషించదగ్గ విషయం అని తను నా వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మాజీ అధ్యక్షులు రామ్ కిషన్ రావు, అఖిల బ్రహ్మన సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పురం ప్రేమ్ చందర్ రావు, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ రామ్మోహన్రావు, లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు జి.వి రంగారావు, సీనియర్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, జర్నలిస్టు శ్రీనివాసరావు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వరరావు.. తదితర బ్రాహ్మణులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *