30 వార్డులలో అర్.అర్.అర్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి

30 వార్డులలో అర్.అర్.అర్
సెంటర్స్ ఏర్పాటు చేయాలి

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
జమ్మికుంట, మే 20 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని 30 వార్డులలో అర్.అర్.అర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు.

శుక్రవారం పాత మున్సిపల్ ఆఫీస్ లో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అర్.పి లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో అర్.అర్.అర్ (రెడ్యూస్, రీ యూజ్, రిసైకిల్) సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటి నుండి వాడిన బట్టలు, పాత పుస్తకాలు, వాడిన షూస్, ప్లాస్టిక్ ఐటమ్స్, బొమ్మలు, రబ్బరు ఐటమ్స్ తదితర వస్తువులు ప్రజల వద్ద నుండి సేకరించి లేని వారికి ఇస్తే ఉపయోగపడే అవకాశం ఉందని, మిగిలిన వస్తువులను రీసైకిల్ చేసే కంపెనీలకు పంపించడం జరుగుతుందని, ప్రతి వార్డులో తప్పకుండా తాత్కాలికంగా ఐనా పర్మనెంట్ గా ఐన అర్.అర్.అర్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, సీల్ అర్పిలు, ఆర్పిలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సదానందం, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *