బీసీల ఆత్మగౌరవంపై ప్రభుత్వ ఆంక్షలు.. జీవో 14 ప్రతులను చింపేసిన దాసోజు శ్రవణ్!

బీసీల ఆత్మగౌరవంపై ప్రభుత్వ ఆంక్షలు.. జీవో 14 ప్రతులను చింపేసిన దాసోజు శ్రవణ్!

బీసీల ఆత్మగౌరవంపై ప్రభుత్వ ఆంక్షలు.. జీవో 14 ప్రతులను చింపేసిన దాసోజు శ్రవణ్!

హైదరాబాద్: బీసీ కుల సంఘాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్‌ 14 తీసుకొచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్వహణను ప్రభుత్వ అధికారుల చేతుల్లో పెట్టడం ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నేత వివేకానంద్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జీవో 14 ప్రతులను చించివేసి నిరసన తెలిపారు.

కేసీఆర్ హయాంలో 41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు కేటాయించి, వాటి ద్వారా స్వయం పాలన, సామాజిక సాధికారతకు అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల కమిటీల పేరుతో కుల సంఘాల స్వతంత్ర నిర్వహణ హక్కులను హరిస్తోందని ఆరోపించారు. కుల సంఘాలతో సంప్రదింపులు జరపకుండానే నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.

బీసీ భవనాలపై ప్రభుత్వ అజమాయిషీ, ఎన్నికల హక్కులపై ఆంక్షలు విధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లకు విరుద్ధమని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. జీవో 14ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో బీసీ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించి సచివాలయాన్ని ముట్టడిస్తామని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *