రైతులను మోసం చేస్తే కేసులు నమోదు: సి.ఐ రమేష్

రైతులను మోసం చేస్తే
కేసులు నమోదు:సి.ఐ రమేష్

జమ్మికుంట, మే 21 (విశ్వం న్యూస్) : రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేయాలని చూస్తే కటిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట పట్టణ సి.ఐ రమేష్ తెలిపారు. శనివారం జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాధి జమ్మికుంట రైతు వేదికలో మండల పరిధిలోని విత్తన డీలర్లతో, ఏ.ఓ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో సి.ఐ రమేష్ మాట్లాడుతూ ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించాలని చూస్తే తమ దృష్టికి తీసుకురావాలని డీలర్లకు సూచించారు.

ఈ సందర్భంగా ఏ.ఓ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిలర్లు కూడా రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధిత రశీద్ లు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ప్రతి రోజువారీగా డీలర్లు తమ తమ షాప్ లలో ఉన్న ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల వివరాలను స్టాక్ బోర్డ్ పై నమోదు చేయాలన్నారు. ఎప్పుడైనా షాపులపై పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ లు సిచ్ లక్ష్మణ్, రాం ప్రసాద్, మండల హార్టకల్చర్ అధికారి గాలయ్య, పలు విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *