జమ్మికుంట:ఎట్టకేలకు
7 రోజులకు నల్లా నీళ్ళు…
- మండే ఎండలో మహిళల నిరసనతో…
జమ్మికుంట, మే 21 (విశ్వం న్యూస్) : 5 రోజులుగా నల్లా నీళ్ళు రావడం లేదని మండే ఎండలో మహిళలు నీళ్ల బిందెలతో రోడ్డుపై నిరసన తెలిపిన రెండు రోజులకు అనగా 7 రోజులకు నల్లా నీళ్ళు శనివారం ఉదయం రావడం చెప్పుకోదగ్గ విషయం.
వివరాల్లోకి వెళితే …గురువారం జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి వార్డులో నల్లా నీళ్ళు రాక 5 రోజులు అవుతుంది అని, అత్యవసర అవసరానికి కూడా నల్లా నీళ్ళు లేకుండా మున్సిపాలిటీ వారు అధికరులైతే నేమి, ప్రజా ప్రతినిధిలు ఐతేనేమి మా నీళ్ల సమస్యలను పట్టించుకోవట్లేదు అని కొత్తపల్లి అయా వార్డులలోని మహిళలు మండే ఎండలో నీళ్ల బిందెలతో యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ ఉపాధ్యక్షుడు సజ్జు ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ఇళ్లంతకుంట క్రాస్ రోడ్ వద్ద నిరసన తెలిపారు .
- శుక్రవారం ‘నీళ్ల కష్టాలు గాలికి – గోవా లో ఎంజాయ్’ అనే
విషయాన్ని ‘విశ్వం న్యూస్’ ప్రచురించడం జరుగింది.
శనివారం ఉదయం 7 రోజులకు నల్లా నీళ్ళు రావడం కొసమెరుపు. ఎర్రటి ఎండలో అత్యవసరం ఐతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ అధికారులు, మీడియా చెబుతుంది. ఐనా మహిళలు నల్లా నీళ్ళ కోసం రోడ్డుపై కి వచ్చారంటే నీళ్ల అవస్థ ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుంది.
మున్సిపాలిటీ పాలక వర్గం, అధికారులు ఇక నైనా మళ్లీ ఇలాంటి కష్టం రానియకండి అంటూ విజ్ఞప్తి చేశారు.