ఎఐటియుసీ రాష్ట్ర మహా సభలు జయప్రదం చేయండి : సిపిఐ

ఎఐటియుసీ రాష్ట్ర మహా సభలు
జయప్రదం చేయండి : సిపిఐ

పాల్వంచ,మే 24 (విశ్వం న్యూస్) : మేడ్చల్ జిల్లాలో జూన్ 6,7వ తేదీల్లో జరుగుతున్న తెలంగాణ రా ష్ట్ర మున్సిపల్ స్టాప్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి యస్.కె.షాబీర్ పాషా మున్సిపల్ స్టాప్ & సంఘం ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సిబ్బందికి పిలుపునిచ్చారు.జూన్,6,7 తేదీలలో మేడ్చల్ లో జరుగుతున్న రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా ఈరోజు బుధవారం పాల్వంచ ఎఐటియుసీ మున్సిపల్ కార్మికులతో కలిసి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఎఐటి యుసి రాష్ట్ర మహాసభల గోడపత్రికలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై జరిగే ఉద్యమాలలో ఎఐటియుసి నాయకత్వాన వహించిందని వారు గుర్తు చేశారు .మున్సిపల్ రంగంలో చాలిచాలని వేతనాలతో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, లేదా కనీస వేతనం రూ.26,000/-లుగా పెంచాలని,మున్సిపాల్టీల్లో పూర్తి స్థాయిలో పిఎఫ్, ఇయస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానం వద్దని,“కాంట్రాక్టు వ్యవస్థ దోపిడి వ్యవస్థ” దుర్మార్గపు శ్రమ దోపిడి విధానం రద్దు చేసి అందర్ని పర్మినెంట్ చేస్తామన్నాఉద్యమ సమయంలో హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అందర్ని పర్మినెంట్ చేస్తామని అనేక సమావేశాలలో చెప్పిన ఇంతవరకు చేయలేదని వారు విమర్శించారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10వ పిఆర్సీ వేతన సవరణ అమలు చేయకపోతే మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు చేశామని వారన్నారు.

2015లో జి.ఓ.నెం. 14లో చాలీచాలని వేతనాలు ప్రభుత్వం పెంచిందన్నారు. గతంలో అన్ని మున్సిపల్ కార్మిక సంఘాలు కలిసి 11వ పిఆర్సీ కొరకు నిరసనలు,ధర్నాలు చేయగా ఎట్టకేలకు 2018 నుంచి ధరలు విపరీతంగా పెరిగిన కాలంలో గ్రేటర్ హైదరాబాద్ లో పని చేసే కార్మికులకు రూ.18000/- చేసిందన్నారు. ఆ సందర్భంగా 60వ జి.ఓ.ను విడుదల చేసిన తరుణంలో. కార్మికులు ఆందోళనలకు గురై, 2020 నుండి అన్ని మున్సిపాల్టీల్లో ఎఐటియుసి నాయకత్వాన మున్సిపల్ ఆఫీస్ వద్ద వేతనాలు పెంచుటకు నిరసనలు, ధర్నాలు చేయడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఎఐటియుసి స్వతహాగా పలు దఫాలుగా నిరసనలు ధర్నాలు చేసి పోరాటానికి సిద్దమవుతున్నామని హెచ్చరికలు కూడా చేసిందన్నారు. వేతనాలు పెంచాలని ఎఐటియుసీ తో పాటు ఐక్య కార్యచరణతో ఎన్నో ధర్నాలు రాసరోకోలు నిరసనలు తెలియజేశామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 60జి.ఓ.ను ప్రభుత్వమే అమలు చేయలేక చివరకు సర్క్యులర్ నెం.4 విడుదల చేస్తూ రూ. 15,500/-లు లతో సరిపెట్టిందన్నారు. ఏఐటీయూసీ గా కనీస వేతనం రూ.26,000/-లు జీతం ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ అనేవి లేకుండా అందరినీ రెగ్యులర్ చేయాలి అన్నారు. జూన్ 6,7వ తేదీలలో మేడ్చల్లో జరుగుతు న్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని వారు ఈసందర్భంగా కార్మికులను కోరారు.

ఈ కార్యక్రమంలో ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం పాల్వంచ మున్సిపల్ అధ్యక్షులు నారపోగు రామయ్య, కార్యదర్శి మాడుగుల ప్రసాద్, కోశాధికారి కంచర్ల శ్రీను, అరివెండ్ల మరియమ్మ, పర్శక సారమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *