టీడబ్ల్యూజేఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరించిన
కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

టీడబ్ల్యూజేఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

తిమ్మాపూర్ , జనవరి 9 (విశ్వం న్యూస్) : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా కమిటీ (2023) టీడబ్ల్యూజేఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను కలెక్టరేట్ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సోమవారం ఆవిష్కరిం చారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ జర్నలిస్టులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్స రంలో అన్ని శుభాలే జరగాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. తన స్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ కలీం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కొండయ్య లకు ఫెడరేషన్ క్యాలెండర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు, జిల్లా అధ్యక్షులు కొమ్మెర తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండోజు శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాదె కరుణాకర్, బొమ్మిడి విజయ కుమార్, సతీష్, కొమ్ము గణేష్, వినోద్, గడ్డం నరేష్, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *