ఎన్టీఆర్ శతజయంతి:ఎన్టీఆర్‌కు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి

ఎన్టీఆర్‌కు బాలకృష్ణ,
జూ.ఎన్టీఆర్ ఘన నివాళి

హైదరాబాద్, మే 28 (విశ్వం న్యూస్) : సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకున్న నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు వాడు ఉండడు. తెలుగు వారిని ప్రపంచం మొత్తానికి తెలియజేసేలా చేసిన ఆయన ప్రయాణం.. చరిత్రగా ఎప్పటికి నిలిచిపోతుంది. నటుడిగా జానపధం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి దానిలో ఆయనకి తిరుగు లేదని అనిపించుకున్నారు.

ఈరోజు మే 28 నందమూరి తారకరామరావు శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు జూనియర్ ఎన్టీఆర్. సమాధి వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు తారక్. జూనియర్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కోలాహలం నెలకొంది. ఘాట్‌ వద్దకు ఫ్యాన్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు.

బాలకృష్ణ నివాళులు..
సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకున్న నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు వాడు ఉండడు. తెలుగు వారిని ప్రపంచం మొత్తానికి తెలియజేసేలా చేసిన ఆయన ప్రయాణం.. చరిత్రగా ఎప్పటికి నిలిచిపోతుంది. ఆయన శత జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *