హీరో శర్వానంద్‌కి యాక్సిడెంట్..

హైదరాబాద్, మే 28 (విశ్వం న్యూస్) : ఆదివారం ఉద‌యం మూడు గంట‌ల ప్రాంతంలో శ‌ర్వానంద్ త‌న డ్రైవ‌ర్‌తో క‌లిసి ఫిల్మ్ న‌గ‌ర్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే వారు ప్ర‌యాణిస్తోన్న రేంజ్ రోవ‌ర్ కారు ఫిల్మ్ న‌గ‌ర్ జంక్ష‌న్ దగ్గ‌ర‌ అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. డ్రైవ‌ర్ ప‌క్క‌నే కూర్చున్న శ‌ర్వానంద్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఐతే.. శర్వానంద్ కి ఏమీ కాలేదనీ… చిన్నగా గాయాలు మాత్రమే అయ్యాయని తెలిసింది. ఇది గమనించిన అక్కడి వారు వెంటనే స్పందించారు.

స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. శర్వానంద్ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం శర్వానంద్‌ పరిస్థితి బాగానే ఉందనీ… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

జూన్ 3న రాజ‌స్థాన్‌లో రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారు. అంటే వారంలోపే వీరి పెళ్లి ఉంద‌గానే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌టం అంద‌రినీ కాస్త క‌ల‌వ‌ర పెట్టింది.

  • హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా వున్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. -టీమ్ శర్వానంద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *