నోట్ల మార్పిడి ప్రక్రియలో… ఇద్దరి మావోయిస్టుల అరెస్ట్ తో…బ్యాంక్ లపై నిఘా వర్గాల అలెర్ట్

ఛత్తీస్ గడ్ ప్రతినిధి, మే 28 (విశ్వం న్యూస్) : ఛత్తీస్ గడ్ లో మావోయిస్ట్ ల ఏరివేత లక్ష్యంగా కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నపోలీసులు ఇకపై బ్యాంక్ లపై కూడా కన్నేశారు. తాజాగా పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేయడంతో సరిహద్దు ప్రాంతంలో పోలీసులు, నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల నొట్లను రద్దు చేయడంతో వాటిని మార్చుకునేందుకు మావోయిస్టులు సమాయత్తం అయినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బ్యాంక్ లో జరిగే లావాదేవీలపై నిఘా వేసి వారి ఆర్థిక ములాలను దెబ్బతీసే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. గురువారం బీజాపూర్ జిల్లా పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలలో వెలుగులోకి వచ్చిన అంశంతో అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లాలోని హమ్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని మహదేవ్ ఘాట్ వద్ద బలగాలు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఒక బైక్ పై వస్తున్న ఇద్దరు తప్పించుకునే ప్రయత్నం చేశారు.

దీంతో బలగాలు వారిని పట్టుకొని ఆరా తీయగా 2 వేల నోట్ల కట్టలు 3 లభ్యం అయ్యాయి, మిగితా డబ్బుతో కలిసి 8 లక్షలు. బీజాపూర్ లోని వివిధ బ్యాంక్ లలో వాటిని మార్చుకునేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో బలగాలకు చిక్కారని పోలీసుల సమాచారం వీరి నుండి వివిధ బ్యాంక్ లకు చెందిన 11 పాస్ పుస్తకాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు సంబందించిన 2 వేల నోట్లను మార్పిడి చేసుకొనేందుకు వచ్చారని పోలీసులు చెప్తున్నారు. నిందితులపై ఛత్తీస్ గడ్ స్పెషల్ పబ్లిక్ సేఫ్టీ ఆక్ట్ కింద బీజాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

అంతటా హై అలెర్ట్ ..
రెండు రోజుల క్రితం బీజాపూర్ లో పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు పట్టుబడటం, వారి వద్ద నుండి నోట్ల బెండిల్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు మావోయిస్టుల సాహిత్యాన్ని కూడా సీజ్ చేశారు. 11 పాసు బుక్కులు కూడా వారి వద్ద ఉండటంతో మావోయిస్టులు 2 వేల నోట్లను మార్చుకునేందుకు శ్రీకారం చుట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు .

వ్యూహం ….
బీజాపూర్ పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టు పార్టీ వారేనని పోలీసులు ప్రకటించిన నేపధ్యంలో మావోయిస్ట్ పార్టీ 2 వేల నోట్లను మార్చుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు అర్థం అవుతుంది. పోలీసులు మావోయిస్ట్ ఆర్థిక ములాలపై దెబ్బ కొట్టాలన్నఆలోచనలతో బ్యాంక్ లలో 2 వేల నోట్ల మార్పిడిపై ఓ కన్నేసి ఉంచినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *