జాతీయ బిసి యువజన సంఘం వీణవంక
మండల అధ్యక్షునిగా మద్దుల ప్రశాంత్
వీణవంక, మే 30 (విశ్వం న్యూస్) : జాతీయ బిసి యువజన సంఘం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం అధ్యక్షుడిగా శ్రీ మద్దుల ప్రశాంత్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్.కృష్ణయ్య, బిసి విద్యార్థి సంఘం జాతీయ కోఆర్డినేటర్ డా, అరుణ్ బాబు , బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ బీసీ యువజన సంఘం వీణవంక మండల అధ్యక్షులు మద్దుల ప్రశాంత్ నియమించడం జరిగింది. ఈ నియామకం ఈరోజు నుండి అమలులోకి వస్తుంది.
ఈ సందర్భంగా మద్దుల ప్రశాంత్ మాట్లాడుతూ బీసీల ఐక్యత కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో పాటుపడతానని నాపై నమ్మకంతో నన్ను నియమించిన జిల్లా అధ్యక్షులకు, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లగోని శ్రీనివాస్, నగర అధ్యక్షులు నితిన్ మరియు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.