ఓటమి విజయానికి మెట్టు-డీఈవో సుశీందర్‌రావు
వైభవంగా ఆర్బీస్ దర్పన్
హైదరాబాద్ , జనవరి 10 (విశ్వం న్యూస్) : ఓటమి విజయానికి మెట్టు అన్నారు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి పి. సుశీందర్‌రావు. ఎంతో మంది సైంటిస్టులు అనేక ఓటముల తర్వాతే తాము అనుకున్నది సాధించారని గుర్తు చేశారు. ఓవైపు చదువులను ప్రోత్సహిస్తూనే.. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సాహించాలన్నారు. అప్పుడే వారిలో పోటీ తత్వం నెలకొంటుంది అని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు లలితా కళాతోరణంలో జరిగిన రవీంద్రభారతి స్కూల్స్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో సుశీందర్‌రావు హాజరయ్యారు.
రవీంద్ర దర్పన్ 2022 – 23 పేరుతో దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, సంతోష్‌నగర్, కర్మాన్‌ఘాట్ జెడ్పీ రోడ్ బ్రాంచ్‌ల యాన్యువల్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జ్ బాబూరావు, డీన్ జ్యోతి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కరోనా తర్వాత విద్యార్థుల పెంపకం తల్లిదండ్రులకు కష్టతరంగా మారిందన్నారు డీఈవో సుశీందర్‌రావు. వాళ్ల ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్‌కు విద్యార్థులు అడిక్ట్ కావడం ఆందోళన కరమన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ట్రెండ్స్‌ను తెలుసుకొని తల్లిదండ్రులు అందుకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. అప్పుడే విద్యార్థుల్లో పేరెంట్స్‌పై నమ్మకం, విశ్వాసం కలుగుతుందన్నారు సుశీందర్‌రావు. వారి ఆసక్తిని తెలుసుకొని స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పిల్లల సృజనాత్మకతను వెలికితీయడానికి తల్లిదండ్రులు కూడా నిత్యం అప్డేట్ కావాలన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ రకాల డ్యాన్స్‌లతో విద్యార్థులు ఇరగదీశారు. పేరెంట్స్, ఇతర ప్రేక్షకుల ప్రోత్సాహంతో లలిత కళాతోరణం వేదికను షేక్ చేశారు. గత నెల రోజులుగా తాము చేసిన ప్రాక్టీస్‌కు ప్రేక్షకుల చప్పట్ల రూపంలో మంచి ప్రోత్సాహం దొరికిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. గజగజ వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.