23వ వార్డులో సెంట్రల్ లైటింగ్
సిస్టం ప్రారంభించిన చైర్మన్

జమ్మికుంట, జూన్ 2 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 23 వ వార్డులో గురువారం కౌన్సిలర్ పోనగంటి మల్లయ్యతో కలిసి చైర్మన్ రాజేశ్వర్ రావు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలకు అభివృద్ధి చేసుకోవటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి.అర్ ఆదేశాలతో ఎం.ఎల్.సి కౌశిక్ రెడ్డి సూచనలతో మున్సిపాలిటీ పరిధిలోని అవసరం అయిన చోట ఏర్పాటు చేస్తున్నామని, పట్టణానికి సుందరమైన నాయిని చెరువును ఇంకా అభివృద్ధి చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నయని తెలిపారు.
జమ్మికుంట పట్టణ పరిధిలోని వైకుంఠ దామలలో 10 లక్షల రూపాయల నిధులతో (అద్దె ఇండ్లల్లో ఉండి చనిపోయిన వారికి దశదిన కర్మ చేసుకోవటానికి) రూములు నిర్మించి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 23వ వార్డ్ కౌన్సిలర్ పొనగంటిమల్లయ్య మాట్లాడుతూ వార్డు ప్రజలకు రాత్రి పూట ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండాలని సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఈ వార్డులో ఏర్పాటు చేయడం జరిగిందని, వార్డు ప్రజల కొరకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పి.ఎ.సి.ఎస్ చైర్మన్ పోనగంటి సంపత్, కౌన్సిలర్ పాతకాల రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మీరెడ్డి, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.