దశాబ్ది ఉత్సవాల పోస్టర్ అవిస్కరించిన ఏ.సి.పి వెంకట్ రెడ్డి
జమ్మికుంట:దశాబ్ది ఉత్సవాల పోస్టర్
అవిస్కరించిన ఏ.సి.పి వెంకట్ రెడ్డి

జమ్మికుంట, జూన్ 2 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం హుజురాబాద్ ఏ.వి.పి కోట్ల వెంకట్ రెడ్డి దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ చేశారు. జమ్మికుంట పట్టణ సి.ఐ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏ.సి.పి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు (2014) రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ ల పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి అని ఆయన అన్నారు.
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని
పోలీస్ స్టేషన్ లలో ఉదయం జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలిష్ శాఖలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అని వివరంగా వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కొన్ని పోలీస్ స్టేషన్ లలో సొంత వాహనాలు లేని పరిస్థితి ఉండేదని, కొన్ని పోలీస్ స్టేషన్ లలో మామూలు జీపులు ఉండేవని, ఎదైనా సంఘటన జరిగితే ఆయా సంఘటన స్థలానికి చేరుకోవాలంటే చాలా ఇబ్బందులు పడెవారమని, ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలిష్ స్టేషన్ లకు అధునాతనమైన వాహనాలను సమకూర్చిందని , ముఖ్యంగా షీ టీమ్స్ ఏర్పాటు , సాంకేతిక విభాగాలలో ప్రస్తుత టెక్నాలజీ ,
దళారుల ప్రమేయం లేకుండా పిర్యాది దారుడు నేరుగా వచ్చి పిర్యాదు చేసుకునే విధంగా ..అందుకు సహకారం కొరకు రిషెప్షన్ కౌంటర్ లు ఏర్పాటు చేయడం జరిగుందని వారు అన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకువచ్చామని , నేరాల నియంత్రణలో సి.సి కెమెరాలు ఏర్పాటు చేయడం , ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే సి.ఈ.ఐ.అర్ పోర్టల్ ద్వారా వెంటనే మొబైల్ లొకేషన్ ను కనిపెట్టే సాంకేతికతను కలిగి ఉన్నామని , ఏ క్షణమైనా పిర్యాదు కోసం 100 కు కాల్ చేస్తే సత్వరంగా చర్యలు తీసుకునే విధంగా సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నామని వారు అన్నారు.
నేరాల నియంత్రణ కొరకు బ్లూ కోట్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని, ఎటువంటి సమస్య అయినా ప్రతి నిమిషం అలెర్ట్ గా ఉంటామని తెలిపారు.జూన్ 2 పతాక ఆవిష్కరణ అనంతరం కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేస్తామని తెలిపారు. జూన్ 2 నుండి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాల లో బాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ.సి.పి వెంకట్ రెడ్డి, పట్టణ సి.ఐ రమేష్ ఇళ్ళంతకుంట ఎస్.ఐ తోట తిరుపతి, వీణ వంక ఎస్.ఐ శేఖర్ రెడ్డి, ఏ.ఎస్.ఐ రవి, హెడ్ కానిస్టేబుల్ మోహన్, హోమ్ గార్డ్స్ సురేష్, అశోక్, రవి, పద్మ, శ్రీనివాస్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
