మల్లికార్జున్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం
ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తాం..
ఒక ప్రకటనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
గోవిందరావుపేట, జనవరి 10 (విశ్వం న్యూస్) : తెలంగాణ ఉద్యమకారుడు గజ్జి మల్లిఖార్జున్ మృతి పట్ల నీటిపారుదల గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు . ఈ సందర్భంగా మల్లికార్జున్ తెలంగాణ వచ్చే వరకు చెప్పులు వేసుకోను అని ప్రకటించి 14 ఏళ్లు చెప్పు లేకుండా నడిచిన ఘనత మల్లికార్జునకి దక్కిందని ఆయన స్ఫూర్తి తెలంగాణ సమాజం మర్చిపోదని దయాకర్ రావు అన్నారు. ఆయన కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవడం బాధాకరం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వారి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.