వీణవంక:బాధిత కుటుంబాలను
పరామర్శించిన బల్మూరి వెంకట్

జమ్మికుంట/వీణవంక : జూన్ 8 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రంలోని పలువురి కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంఛార్జ్, (ఏ.ఐ.సి.సి సభ్యులు), ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్. వీణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఇటీవల మరణించిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించడం వారి యోగ క్షేమాలు తెలుసుకోవడం వలన బల్మూరి వెంకట్ పట్ల ప్రజలలో నమ్మకమైన అండ అని ఆయా గ్రామస్థులు అనుకుంటున్నారు.
ఎన్నికలు జరిగి 4సంవత్సరాల 6నెలలకు పైగా అవుతున్నా.. హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికలలో గెలిచిన నాయకుడి కంటే ఓడిన బల్మూరి వెంకట్ ప్రజల కష్టాలను పోరాటాల రూపంలో, పరామర్శల రూపంలో, ఆర్థిక సహాయం రూపంలో ప్రజల కష్టాలను పాలు పంచుకుంటుండు అని ఆయా గ్రామస్థులు కొనియాడారు.


వీణవంక మండల కేంద్రములోని దాసరపు లచ్చమ్మ కుటుంబాన్ని, కొమురయ్య కుటుంబాన్ని మరియు రామస్వామి కుటుంబాలను పరామర్శించారు.
రెడ్డిపల్లి గ్రామంలో వడ్డేపల్లి లచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.
హిమ్మత్ నగర్ గ్రామంలో సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
కోర్కల్ గ్రామంలో అఫ్జల్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఇప్పలపల్లిలో దేవయ్య కుతుంబాన్ని పరామర్శించరు.
ఆయా గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశారు.
బల్మూరి వెంకట్ వెంట పి.సి.సి సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి, మండల నాయకులు, సీనియర్ నాయకులు చింతల శ్యామ్ సుందర్ రెడ్డి, రజాక్, నల్లగొని వీరయ్య, సంపత్ రెడ్డి, ఎలవేణి సదయ్య, గట్టయ్య, సతీష్, మండల రాజయ్య, ఒడ్డేపల్లి కొమురయ్య, శ్రీకాంత్, గడ్డం కుమార్, సురేందర్ రెడ్డి దిలీప్, హకీమ్, మోహన్ రెడ్డి, చీరే బుచ్చయ్య, కాశీమ్ తదితరులు పాల్గొన్నారు.
