
జమ్మికుంట/హుజురాబాద్, జూన్ 8 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ నియోకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బల్మూరి వెంకట్ హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్నిమండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. బుదవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలోని గ్రామాలలో ఇటీవల మరణించిన కుటుంబ సభ్యులను పరమార్శించి, అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని, యాక్సిడెంట్స్ కు గురైన వారికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ..నేనున్నాను మీ వెంట అనే ధైర్యం కల్పించాడు. హుజురాబాద్ నియోజక వర్గంలోని అన్ని మండలాలలోని పలు గ్రామాలలో ఇటీవల మరణించిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించడం వారి యోగ క్షేమాలు తెలుసుకోవడం తగు సూచనలు సలహాలు ఇవ్వడం పట్ల ప్రజలలో బల్మూరి వెంకట్ నమ్మకమైన అండ అని ఆయా గ్రామస్థులు అనుకుంటున్నారు.

ఎన్నికలు జరిగి 4సంవత్సరాల 6నెలలకు పైగా అవుతున్నా.. హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికలలో గెలిచిన నాయకుడి కంటే… ఓడిన బల్మూరి వెంకట్ ప్రజల కష్టాలను, పోరాటాల రూపంలో, పరామర్శల రూపంలో, ఆర్థిక సహాయం రూపంలో, సలహాలు, సూచనల రూపంలో ప్రజల కష్టాలను పాలు పంచుకుంటుండు అని ఆయా గ్రామస్థుల చర్చల్లో వినిపించింది.

జమ్మికుంట పట్టణ పరిధిలోని 3వ వార్డులో, 20వ వార్డులో, హుజురాబాద్ మండలంలోని ధర్మరాజ్ పల్లి, రాంపూర్, సిరిసపల్లి, తుమ్మనపల్లి, సింగపూర్ గ్రామాలలో, ఇల్లంత కుంట మండలంలోని టేకుర్తి గ్రామంలో, వీణవంక మండల కేంద్రములోని దాసరపు లచ్చమ్మ కుటుంబాన్ని, కొమురయ్య కుటుంబాన్ని మరియు రామస్వామి కుటుంబాలను, రెడ్డిపల్లి గ్రామంలో వడ్డేపల్లి లచ్చమ్మ కుటుంబాన్ని, హిమ్మత్ నగర్ గ్రామంలో సమ్మయ్య కుటుంబాన్ని, కోర్కల్ గ్రామంలో అఫ్జల్ కుటుంబాన్ని, ఇప్పలపల్లిలో దేవయ్య కుతుంబాన్ని, కమలాపూర్ మండలంలోని వంగపల్లి, మాధన్నపేట, అంబాల, గూడూరు, నేరెళ్ళ, ఉప్పల్ గ్రామాలలో, ఆయా గ్రామాల్లోని మరణించిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం వ్యక్తం చేస్తూ, అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని, యాక్సిడెంట్స్ కు గురైన వారికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ..నేనున్నాను మీ వెంట అనే ధైర్యం కల్పించాడు.

ఈ సుడిగాలి పర్యటన కార్యక్రమంలో బల్మూరి వెంకట్ వెంట హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.