ములుగు: కుసుమ జగదీష్
పార్థివదేహానికి పుష్పాంజలి
ఘటించిన మంత్రి కేటీఆర్

- కుసుమ జగదీష్ పిల్లల్ని అక్కున చేర్చుకొని.. బీఆర్ఎస్ జెండాను కప్పి కడసారి వీడ్కోలు పలికిన మంత్రి కేటీఆర్
ములుగు, జూన్ 12 (విశ్వం న్యూస్) : కుసుమ జగదీష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ములుగుకు బయలుదేరి వెళ్లారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్.. జగదీశ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు.

వారి కుటుంబానికి ధైర్యం చెప్పి కుసుమ జగదీష్ గారి పిల్లల్ని హక్కును చేర్చుకొని ఓదార్చారు. ఉద్యమ నేతకు కడసారి వీడ్కోలు పలికి నివాళి అర్పించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను జగదీష్ పార్థివదేహం పై కప్పారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మంత్రి కేటీఆర్ వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని భరోసా కల్పించారు.
