
- మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి తో కలిసి నివాళి అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
- భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను కుసుమ జగదీష్ పార్థివదేహం పై కప్పిన మంత్రులు
- కుసుమ జగదీష్ పిల్లల్ని అక్కున చేర్చుకొని.. బీఆర్ఎస్ జెండాను కప్పి కడసారి వీడ్కోలు పలికిన మంత్రి కేటీఆర్

ములుగు, జూన్ 12 (విశ్వం న్యూస్) : తెలంగాణ ఉద్యమ నేత, ములుగు జెడ్పీచైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గారి అంత్యక్రియలకు మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై భారత రాష్ట్ర సమితి జెండా ను కుసుమ జగదీష్ పార్థీవ దేహాము పై కప్పి ఘన నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని భరోసా కల్పించారు.



