బిఆర్ఎస్ ప్రభుత్వానికి దళిత
మహిళా రిజర్వేషన్ల పైన
ఎందుకింత చిన్నచూపు?

హుజురాబాద్ ఆర్సి, జూన్ 13 విశ్వంన్యూస్ : హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బల్మూరి వెంకట్, ఆదేశాల మేరకు జమ్మికుంట మార్కెట్ కమిటీకి మహిళ చైర్మన్ దళిత మహిళకు రిజర్వేషన్ కేటాయించి సంవత్సరం గడిచిన ఇంతవరకు టిఆర్ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకోకుండా ఆ యొక్క చైర్మన్ పదవి భర్తీ చేయకుండా ఆపడం కేవలం మహిళ రిజర్వేషన్ కావడమా, లేక దళిత మహిళ కావడమా అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, ఈ పోస్టును వెంటనే భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
ఈ పత్రిక విలేకరుల సమావేశానికి జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, హుజురాబాద్ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ పార్టి ప్రెసిడెంట్ మొలుగూరి సదయ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు సుశీల, మైనార్టీ టౌన్ అధ్యక్షుడు అప్సర్, సీనియర్ నాయకుడు ఎర్ర రవీందర్, కుర్ర శీను, రమేష్, బిక్షపతి, సంపత్, రఘుపతి, ఐలయ్య, మధు, రవి, సునీత, లక్ష్మి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.