బాసర ట్రిపుల్ ఐటీ:అసలేం జరుగుతోంది?

  • కుక్కలు తరుమడంతో భవనంపై నుండి కింద పడి మరణించినది అంటున్న వార్డెన్
  • అసలు కుక్కలు లేవు.. అన్ని తీసివేశారు..కదా
  • యుట్యూబ్ చూస్తూ కింద పడిపోయిందన్న ఇంచార్జి వి.సి వెంకటరమణ
  • విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అని అనుమానం వ్యక్తం చేస్తున్న వైద్యులు

బాసర, జూన్ 15 విశ్వంన్యూస్ : బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో మొన్న దీపిక…నిన్న బూర లిఖిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఇద్దరు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలే..కారణం ఏమిటీ, ఎందుకు, ఎలా జరుగుతున్నాయి..కనీసం యాజమాన్యం ఒక ప్రెస్ మీట్ పెట్టీ.. ఇలా జరిగింది..ఇంకోసారి జరుగకుండా చూసుకుంటాము అని చెప్పడం లేదు ఎందుకు..కనీసం తల్లిదడ్రులకి చెప్పరు..పేరెంట్స్ కమిటీ చెప్పరు..మరీ ఎవరికి చెబుతారు..మెస్ లు, టెండర్లు ఎందుకు మారడం లేదు..కనీసం పిల్లలు చదువుకోవడానికి బుక్స్ ఎందుకు ఇవ్వడం లేదు..డైరెక్టర్ సతీష్ కుమార్ సర్ చెక్ పవర్ ఎందుకు రద్దు చేశారు..కోట్లాది రూపాయలు ఎక్కడికి పోతున్నాయి..ఎవరు అడగరు…ఎవ్వరూ చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆరోపణ చేసినట్లు త్రిబుల్ ఐటీ బాసర మెస్సులు టెండర్లు, వెండర్ల విషయంలో ఎవరు ఒక్క కట్టెపుల్ల కూడా కదలియలేరు అన్నట్లు అదే నిజమని ఇప్పుడు యావత్ రాష్ట్రం త్రిబుల్ ఐటీ బాసర తల్లిదండ్రులు అనుకుంటున్నారు.. బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ అంటేనే జంకుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఈ సంవత్సరం 1500 మంది విద్యార్థులు విద్యార్థుల మొదటి సంవత్సరం సీట్లు భర్తీ అయ్యేనా అడ్మిషన్ల ముందు ఇద్దరు అమ్మాయిలు చనిపోతే ఇంకెవరైనా వస్తారా… నవ్వుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది కనీసం అధికారులు కానీ యూనివర్సిటీ యాజమాన్యం గానే జిల్లా కలెక్టర్ గారి విద్యాశాఖ మంత్రి గాని ప్రభుత్వం గాని స్పందించకుండా నిమ్మకు నీరత్తి ఉండడం పట్ల ఆంతర్యం ఏమిటి..???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *