కరీంనగర్:క్విజ్ అవగాహనపై
ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలతో
సమావేశమైన బల్మూరు వెంకట్
కరీంనగర్, జూన్ 15 విశ్వంన్యూస్ : కరీంనగర్ లో ఏర్పాటుచేసిన ఎన్ ఎస్ యు ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బల్మూర్ వెంకట్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అనుసరించి టిపిసిసి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లో ప్రతి ఎన్ ఎస్ యు ఐ కార్యకర్త భాగస్వాములు అయి విద్యార్థులకు యువకులకు అందరికి అవగాహన కల్పిస్తూ ఆన్లైన్ రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కాంపిటీషన్లో చేర్పించవలసిందిగా సూచించారు. క్విజ్ లో గెలుపొందిన వారికి బహుమతు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో నిలిచిన మహిళకు ఎలక్ట్రానిక్ బైక్ బహుమతిగా ఇవ్వబడుతుందని తెలిపారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలన్నారు.
ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనడం వలన విద్యార్థుల్లో యువకుల్లో ఉన్నటువంటి మేదోశక్తి బయటికి వస్తుందన్నారు. ఈ క్విజ్ కార్యక్రమంలో బాధ్యతగా వ్యవహరించినటువంటి కార్యకర్తల అందరికి మంచి పదవులు లభిస్తాయని కావున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఆన్లైన్ రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కాంపిటీషన్లో చేర్పించాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్యకర్తల అందరికీ తను అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడు మునిగంటి అనిల్ వహించగా, ముఖ్య అతిథులుగా జోనల్ ఇన్చార్జీలు అఖిలేష్ యాదవ్, ఫిరోజ్, జిల్లా ఇన్చార్జ్ థామస్, మొన్న జీవన్, బొంకురి అవినాష్,జిల్లా సెక్రటరీ జనరల్ సెక్రెటరీ ఇమ్రాన్, దేశరాజు అనిల్,రాపోలు అనిల్, రాంప్రసాద్ ,సుమారు వందమంది కార్యకర్తలు పాల్గొన్నారు.