కరీంనగర్ బల్దియాకు మరో అవార్డు

కరీంనగర్ బ్యూరో, జూన్ 19 (విశ్వం న్యూస్) : రవీంద్ర భారతిలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీస్కుకున్న కమీషనర్ సేవా ఇస్లావత్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచినందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ హరిత అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ హరిత అవార్డులను ప్రకటించింది.
ఇందులో లక్ష పై బడిన పట్టణాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ ఉత్తమ అవార్డు కు ఎంపికైంది. ఈ నేపథ్యంలో సోమవారం రోజు హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో జరిగిన తెలంగాణ హరిత దినోత్సవ వేడుకల్లో అవార్డు ను ప్రదానం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా కమీషనర్ సేవా ఇస్లావత్ అవార్డును స్వీకరించారు.