ఇల్లంతకుంట:ఘనంగా బాబు
జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

ఇల్లంతకుంట, జూలై 6 (విశ్వం న్యూస్) : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు సంఘసంస్కర్త తన పరిపాలన దక్షతతో అఖండ భారతావానికి విశేష సేవలు అందించిన మహానేత కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత మాజీ ఉప ప్రధాని అని ఆయన సేవలను కొనియాడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ బండి మల్లేష్, గోడిశాల పరమేష్, పైడిపల్లి దేవేందర్, గడపురం మహేష్, సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, NSUI మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.