అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 137ఏ ప్రమాణ స్వీకారం ఘనంగా

అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 137ఏ ప్రమాణ స్వీకారం ఘనంగా

విశ్వం న్యూస్/కరీంనగర్, ఏప్రిల్ 25 : కరీంనగర్ నగరంలోని ఐఎంఏ హాల్లో శుక్రవారం అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 137ఏ ఆధ్వర్యంలో 12వ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొంజర్ల మహేష్ జిల్లా గవర్నర్‌గా, సుద్దపల్లి ప్రసాద్ (వీడీజీ-1), ముసుకుల సాగర్ రెడ్డి (వీడీజీ-2), పండుగ నాగరాజు (డీసీఎస్), కటుకూరి సుధాకర్ (జేడీసీఎస్), సోమవారపు వెంకన్న (డీసీటీ), పుల్లల శ్యామ్ (డీపీఆర్‌ఓ), మాటేటి శ్రీనివాస్ (ఆర్‌సీ), అల్లాడి ఆనంద్ కుమార్ (జేసీ) తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఇల్లంతకుంటలో బాడీ ఫ్రీజర్స్, అంతిమ యాత్ర వాహనం నిర్వహణ సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఇన్స్టాలేషన్ ఆఫీసర్ డా. ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ క్లబ్‌లో 300కు పైగా లైఫ్ మెంబర్స్, 300కు పైగా సాధారణ సభ్యులు ఉన్నారని తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంట్లు, అంతిమ యాత్ర వాహనం, బాడీ ఫ్రీజర్స్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, కుమారస్వామి, గాలిపెల్లి నాగేశ్వరరావు, మోర అంజయ్య, రాజేంద్రప్రసాద్, పసుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 150 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *