- మూడు ఎకరాల రైతుకు ముప్పుటలా కరెంట్ ఎందుకు ?
- రైతాంగానికి ఉచిత కరెంటుపై
రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు
పట్టిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూలై 11 (విశ్వం న్యూస్) : అమెరికాలో జరుగుతున్న తానా సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కడ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉచిత పథకాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అనవసరంగా ఉచిత పథకాలు అందిస్తున్నారని, అలా అందించకూడదని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని, అలా ఇవ్వకూడదన్నారు. కేవలం రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని రేవంత్ తెలిపారు.