శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ జక్కా, కార్పొరేటర్ శాలిని

శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో
ప్రత్యేక పూజలు నిర్వహించిన
మేయర్ జక్కా, కార్పొరేటర్ శాలిని

హైదరాబాద్, జూలై 16 (విశ్వం న్యూస్) : కనివిని ఎరుగని రీతిలో 18వ డివిజన్ పార్వతి నగర్ లో బోనాల సంబరాలు.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయం పార్వతి నగర్ లో కనీవీనీ ఏరుగని రీతిలో బోనాల సందర్భంగా శ్రీ బంగారు మైసమ్మ తల్లి బోనాల సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మేయర్ జక్కా వెంకరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు బోనాలు, బంగారు మైసమ్మ తల్లి శుభాకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు కలిగి జీవించాలని, వారి ఇండ్లలో బంగారు పంట పండాలని ప్రత్యేకించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్, డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు, పలు కాలనీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి యువత, మహిళలు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *