గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెను విరమింప చేయాలి

గ్రామపంచాయతీ సిబ్బంది
సమస్యలు పరిష్కరించి వారి
సమ్మె ను విరమింప చేయాలి

  • మంత్రి ఎర్రబెల్లి ని కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

హైదరాబాద్, జూలై 21 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 50 వేలమంది సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించి వారు చేస్తున్న సమ్మెను విరమింప చేయాలని మాజీ ఎమ్మెల్యే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామ మంచినీటి సరఫరా శాఖల మంత్రి దయాకర్ రావుకి విజ్ఞప్తి చేశారు.

గ్రామ పంచాయితీ సిబ్బంది పారిశుధ్య కార్మికులుగా, ఎలక్ట్రీషియన్ లుగా పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. అని వారి సమస్యలు తీర్చాలని కోరారు. గ్రామపంచాయితీ సిబ్బందికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రతి నెల సరైన వేతనాలు ఇవ్వాలని వారి 8 డిమాండ్లను వివరిస్తూ వినతిపత్రం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *