మల్టీ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరం అందరూ సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే దాసరి
పెద్దపల్లి, జనవరి 17 (విశ్వం న్యూస్) : పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈనెల 22-01-2023 ఆదివారం రోజున పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ప్రైమరీ స్కూల్లో గౌరవ పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సన్ షైన్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరాన్ని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం బ్రోచర్ నీ ఆయనే ఆవిష్కరించారు.. అనంతరం వారు మాట్లాడుతూ సన్ షైన్ హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో పెద్దపల్లి పట్టణంలోని ప్రైమరీ స్కూల్ నందు 22 తారీకు ఆదివారం రోజున ఉదయము 10 గంటల నుండి ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమవుతుందని ఈ యొక్క శిబిరంలో మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రీషియన్, డెంటిస్ట్, ఎండి జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ ,ఆప్తమాలజిస్ట్, ఇతర రుగ్మతలకు సంబంధించిన స్పెషాలిటీ డాక్టర్స్ పెద్దపల్లికి విచ్చేసి ప్రజలకు ఉచితంగా పరీక్షలు చేయించి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని ఈ యొక్క శిబిరంలో రాండమ్ బ్లడ్ షుగర్, బిపి, బ్లడ్ గ్రూపింగ్, ఈసీజీ మరియు 2d ఎకో ఉచితంగా పరీక్షలు చేయడం జరుగుతుందని మరియు డాక్టర్లచే రాసిన మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం కొరకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరినారు. ఈ కార్యక్రమంలో సన్ షైన్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ సురేష్, హెల్త్ క్యాంప్ ఆర్గనైజర్స్ ఇంజనీరింగ్ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ సయ్యద్ అజీజ్, లైసెట్టి బిక్షపతి, చొప్పరి వంశీ,ఎంపీపీలు, జడ్పిటిసిలు, AMC చైర్మన్ లు, PACS చైర్మన్ లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.