ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఆలయాల అభివృద్ధికి కృషి

  • బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యంలో దాత‌ల స‌హకారంలో చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి ప‌నులను ప్రారంభించిన మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద్

హైద‌రాబాద్, ఆగస్టు 8 (విశ్వం న్యూస్) : ఆలయాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ వారి ఆల‌యంలో దాత‌ల స‌హ‌కారంతో భ‌క్తుల స‌దుపాయం కోసం చేప‌ట్టిన పలు అభివృద్ధి పనుల‌ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

రూ. 8 లక్ష‌ల వ్య‌యంతో ఎల్ల‌మ్మ అమ్మ‌వారి ఆల‌య రాజ‌గోపుర ద్వారానికి గ‌ల రాగి తొడుగుల‌పై బంగారు పాలిష్, రూ. 3 ల‌క్ష‌ల వ్య‌యంతో టేక్ తో చేయించిన శ్రీ పోచ‌మ్మ‌ ఆల‌య‌ ద్వారాల‌కు రాగి రేకుల‌తో కూడిన బంగారు పాలిష్, రూ. 2.75 ల‌క్ష‌ల వ్య‌యంతో టికెట్ వెండింగ్ మెషిన్, రెండు 5000 లీట‌ర్ల సామ‌ర్ధ్యం క‌లిగిన మినర‌ల్ వాట‌ర్ ప్లాంట్ ల‌ను మంత్రులు ప్రారంభించారు.

అనంత‌రం మంత్రులు మాట్లాడుతూ…. సీయం కేసీఆర్ తోడ్పాటుతో రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణ, ప‌లు ఆల‌యాల అభివృద్ధికి కృషి చేస్తున్నామ‌ని అన్నారు. అంతేకాకుండా భక్తుల‌కు మైరుగైన సౌక‌ర్యాలు, ఆన్ లైన్ సేవ‌లు క‌ల్పించ‌డంతో ఆల‌యాలకు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిందని తెలిపారు.

ముఖ్యంగా ప‌ర్వ‌దినాల‌లో అన్ని పుణ్య‌క్షేత్రాలు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించి దశ లవారీగా ప్రభుత్వం ప్ర‌త్యేక నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. ఆధ్యాత్మిక‌, ఆహ్లాదకరంగా ఉండేలా భ‌క్తుల‌కు అన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తోందని వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *