- వీఆర్ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు నిర్ణయంపై స్టే
- జీవోలను రద్దు చేసిన హైకోర్టు
- యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 10 (విశ్వం న్యూస్) : తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీఆర్ఏల సర్దుబాటును హైకోర్టు నిలిపివేసింది. వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. జులై 24న జీవోకు ముందున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఓవైపు.. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియపై హర్షం వ్యక్తం కాగా.. మరోవైపు వ్యతిరేఖత వచ్చింది. వీఆర్ఏలను ఆయా శాఖల్లో సర్ధుబాటు చేయటాన్ని వ్యతిరేకిస్తూ.. పలు చోట్ల నిరసనలు చేస్తున్నాడగా.. మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. దీంతో.. వాళ్ల పిటిషన్లను అనుమతించిన కోర్టు.. ఈ సర్దుబాటు ప్రక్రియపై స్టే విధించింది.