కరీంనగర్:నాలుగునెలల్లో మీరంతా మాజీలే:నరేందర్ రెడ్డి ఫైర్

నాలుగునెలల్లో మీరంతా
మాజీలే:నరేందర్ రెడ్డి ఫైర్

  • ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ కు పదమూడు కాదు, ఒక్కటి కూడా గెలువరు
  • కేబుల్ బ్రిడ్జి మళ్లీ కుంగుతుందనే పక్కదారి పట్టించే ప్రయత్నం
  • నగరంలో 132 కోట్లు కాదు,1032 కోట్లు పెట్టినా ఇంకా మట్టి రోడ్లు,డ్రైనేజీలు మిగిలిపోతాయి
  • నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్

కరీంనగర్ బ్యూరో, ఆగస్టు 14 (విశ్వం న్యూస్) : ఉమ్మడి జిల్లాలో పదమూడు నియోజక వర్గాల్లో బిఆర్ఎస్ గెలుస్తుందని విర్ర వీగుతున్న గంగుల కమలాకర్ కు సీన్ రివర్స్ కాబోతుందని ఒక్క టైన గెలిచే పరిస్థితి లేదని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 132 కోట్లతో నగరంలో మట్టి రోడ్లు లేకుండా చేస్తున్నామని అందులో ఇంకా 25 కోట్లు మిగులుతున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.నగరంలో మట్టి రోడ్లు లేకుండా చేయాలంటే 1032 కోట్లు ఖర్చు చేసినా ఇంకా మట్టి రోడ్లు డ్రైనేజీలు మిగిలి ఉంటాయని నరేందర్ రెడ్డి అన్నారు.

విలీన గ్రామాలు శివారు కాలనీలలో ఎంతో చేయాల్సింది ఉందని అన్నారు.భారీ వాహనాలు వెళ్తే కేబుల్ బ్రిడ్జి మళ్లీ కుంగుతుందని వీకెండ్ మస్తి పేరు మీద ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. వీకెండ్ రెండు రోజులు వదిలి పెడితే మిగితా రోజులలో ఎందుకు భారీ వాహనాల కు అనుమతిస్తలేరని ఆయన ప్రశ్నించారు.సమద్ నవాబ్ మాట్లాడుతూ ఖాజిపూర్ లోని గంగుల కమలాకర్ ఫామ్ హౌస్ వక్ఫ్ బోర్డు ఆస్తి కాదని నిరూపిస్తే మేం ఏ శిక్షకైనా సిద్ధమే అని అది వక్ఫ్ ఆస్తి అని పూర్తి ఆధారాలు మేము పాత్రికేయ మిత్రులకు ఇస్తున్నాం వారం రోజులలో కాదని గంగుల కమలాకర్ నిరూపించాలని లేకపోతే అది వక్ఫ్ ఆస్తి అని ఒప్పుకొని కమలాకర్ ప్రకటించినట్టు వక్ఫ్ భూమితో పాటు మూడు ఎకరాలు ఇవ్వాలని అన్నారు.

ఈ విలేఖరుల సమావేశంలో ఎండి తాజ్,రహ్మత్ హుస్సేన్, కుర్ర పోచయ్య,దండి రవీందర్, ముల్కల కవిత, ఎండి చాంద్, జీడి రమేష్, ఎగ్గడి శారద, లయాక్,నెల్లి నరేష్, నాగుల సతీష్, ముక్క భాస్కర్, మహాలక్ష్మి, సయ్యద్ ఖలీల్, ముల్కల యోన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *