వాణిజ్య పన్నుల శాఖలో ప్రమోషన్లు వెంటనే ఇవ్వండి

వాణిజ్య పన్నుల శాఖలో
ప్రమోషన్లు వెంటనే ఇవ్వండి

  • వాణిజ్య పనుల శాఖలో ఏ సి టి ఓ లకు డి సి టి ఓ మరియు డి సి టి ఓ లకు సి టి ఓ ప్రమోషన్లు వెంటనే ఇవ్వండి
  • తెలంగాణ రాష్ట్ర టి సి టి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అడిషనల్ కమిషనర్ వై సునీత కు విజ్ఞప్తి

హైదరాబాద్, ఆగస్టు 22 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో ఈ నెలలో జరిగిన అధికారుల బదిలీలు అడిషనల్ కమిషనర్ జాయింట్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ డి సి టి ఓ మరియు ఏ సిటీవో లా బదిలీలు జరిగినాయి. మల్టీ జోన్ 1 నుండి హైదరాబాద్ తో కూడిన మల్టీజోన్ 2 కి చాలా బదిలీలు జరిగినందు వలన మల్టీ జోన్ 1 లో 36 సర్కిల్ కార్యాలయాల్లో అసిస్టెంట్ కమీషనర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. మల్టీజోన్ 1& 2 లో ఏర్పడిన పోస్ట్ లను ప్రమోషన్ ల ద్వారా వెంటనే భర్తీ చేయాలనీ అడిషనల్ కమిషనర్ మరియు సెక్రెటరీ శ్రీమతి వై సునీత కు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కలసి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీమతి వై సునీత అడిషనల్ కమిషనర్ కాశి విశ్వేశ్వరరావు, అబిడ్స్ డివిజన్ జాయింట్ కమిషనర్ శ్రీమతి లావణ్య, జాయింట్ కమిషనర్ వి శ్రీనివాస్ రెడ్డి లకు కలిసి వరంగల్ హైదరాబాదులో రూరల్ మరియు సికింద్రాబాదులలో ఏర్పడ్డ ముఖ్యముగా మల్టీ జోన్లో నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మరియు వరంగల్ డివిజన్లలో కూడిన అనేక ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది.

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ సెక్రటరీ తాత్కాలిక ప్రమోషన్లు చేపట్టి అర్హతలైన డి సి టి ఓ నుండి సిటిఓ లకు మరియు ఏ సి టి ఓ నుండి డి సి టి ఓ లకు ప్రమోషన్లు ఇంకా క్రింది స్థాయి వరకు వెంటనే ప్రమోషన్ లు ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

జీఎస్టీ పాలనలో మెరుగైన సేవలను అందించడానికి ఖాళీలు ఏర్పడిన ప్రాంతాలలో పనిచేస్తున్న ఏసీటీవోల నుండి డీసీ టి ఓ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి అలాగే డి సి టి ఓ నుండి సీ టి ఓ అదనపు బాధ్యతలు కాకుండా ప్రమోషన్ వెంటనే ఇవ్వడానికి తద్వారా సీనియర్ లకు అన్యాయం జరగకుండా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీ సంఘం పక్షాన రిప్రజెంటేషన్ ఇచ్చి కోరినారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ డివిజన్ టీ సిటిఎన్జీవో అధ్యక్షుడు జి బిక్షపతి తో పాటు అనిల్ కుమార్, శ్రీనివాస్ రావు, ఎం ఏ బారి, ఆనందం, సారయ్య,రాష్ట్ర కార్యదర్శి జలాలొద్దీన్, అబిడ్స్ డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్, సునీల్, నలిమేల శ్రీనివాస్, స్వరూప రాణి, కృష్ణవేణి, సునీత, రూరల్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *