రేకుర్తి కంటి ఆసుపత్రి ని
సందర్శించిన వైస్ ఛాన్సెలర్

తిమ్మాపూర్, ఆగస్టు 30 (విశ్వం న్యూస్) : కరీంనగర్ లోని లయన్స్ క్లబ్ ( రేకుర్తి) వారి ఉదార నేత్ర వైద్యశాలను బుధవారం శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ సంకసాల మల్లేష్ సతీసమేతంగా సందర్శించారు. అనంతరం ఉదార నేత్ర వైద్యశాలలో కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీ లించి ఆసుపత్రి చేస్తున్న సేవలను కొనియాడారు. ఆసుపత్రిలో ప్రారంభించిన నూతన విభాగలైన మెల్లకన్ను, రెటిన, గ్లాకోమా గురించి ఆయా పరీక్షలు, పరికరాల పని తీరును ప్రశంసించారు. నేత్ర జ్యోతి పథకానికి ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు యూనివర్సిటీ లోని ఎన్ఎస్ఎస్ టీమ్ ద్వారా కాని, మరి విధంగానైనా ట్రీ ప్లాంటేషన్ గురుంచి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొండ వేణు మూర్తి, ట్రస్ట్ సభ్యుడు కోల అన్నా రెడ్డి, యూనివర్సిటీ అధికారులు, రిజిస్ట్రార్ ఎం.వరప్ర సాద్, ఫైనాన్స్ ఆఫీసర్ రవీందర్, సూపరింటెండెంట్ సి హెచ్.హరికిషన్, తదితరులు పాల్గొన్నారు.