సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
బీఆర్ఎస్ యువతకు పిలుపు నిచ్చిన రసమయి
తిమ్మాపూర్, జనవరి 20 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ప్రజా సంక్షే మ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసన సభ్యులు డా.రసమయి బాలకిషన్ యువతకు పిలుపు నిచ్చారు. శుక్రవారం మానకొండూర్ నియోజక వర్గ కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్ జీవి.రామకృష్ణారావు ఆధ్వర్యంలో మండల యూత్ అధ్యక్షుడు అడప శ్రీనివాస్ అధ్యక్ష తన మానకొండూర్ మండల యూత్ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లో కీలక పాత్ర పోషించిన ఘనత యువజన విభాగా నికి దక్కిందని ఆయన గుర్తు చేశారు. అదే విదంగా టీఆర్ఎస్ పార్టీ నుండి అవత రించిన బీఆర్ఎస్ పార్టీ పటిష్టతతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పాటు పడాలని ఎమ్మెల్యే రసమయి గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డా. రస మయి బాలకిషన్, సుడా చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుతో పాటు జడ్పిటిసిలు, ఎంపీపీలు, వివిధ గ్రామాల సర్పంచు లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, తదితరులు పాల్గొన్నారు.