Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణమెదక్‌

ఘోర రోడ్డు ప్రమాదం-ఐదుగురు విద్యార్థులు మృతి!

  • ఐదుగురు పరిస్థితి విషమం

సిద్దిపేట, (విశ్వం న్యూస్) : సిద్దిపేట జిల్లా సరిహద్దు గ్రామమైన శనిగరం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుంచి క్వాలిస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఆరుగురు విద్యార్థులను గాయపడగా వారిని సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

విద్యార్థులంతా గజ్వేల్ నుంచి ప్రత్యేకంగా వాహనం మాట్లాడుకుని కరీంనగర్ లో పరీక్ష రాసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

ప్రమాద సమయంలో క్వాలిస్‌లో మొత్తం 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్, గ్రీష్మ, నమ్రత అనే ముగ్గురు విద్యార్థులు ప్రమాద స్థలంలోనే మరణించినట్లు సమాచారం. విద్యార్థులంతా సిద్దిపేట ఇందూర్ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుకుంటున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *