పార్కు మరియు కమ్యూనిటీ హాల్ కొరకు ఎమ్మెల్యేకు వినతి పత్రం
పార్కు మరియు కమ్యూనిటీ హాల్
కొరకు ఎమ్మెల్యేకు వినతి పత్రం

- సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
బండ్లగూడ జాగిర్, (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి వార్డు బృందావన్ కాలనీ గంధంగూడ లోని సర్వే నంబర్ 86 ప్రభుత్వ స్థలంలో పార్కు మరియు కమ్యూనిటీ హల్ కొరకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ని కాలినివాసులతో కలిసి కలవడం జరిగింది. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, బంగారు మైసమ్మ టెంపుల్ చైర్మన్ తలారి ప్రేమ్ కుమార్, మాజీ అధ్యక్షులు యామిని జంగయ్య, ఆంజనేయులు, రఘు, శ్రీకాంత్ చారి, కమల్, ప్రభాకర్, పాల్, రతన్ రాజు, సమ్మయ్య, అంజయ్య, రమేష్, శ్రీకాంత్, దస్తగిరి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
