విద్యార్థులతో ప్రతిజ్ఞ..
- తడి పొడి హానికరమైన చెత్తపై
జమ్మికుంట సెప్టెంబర్ 23 (విశ్వం న్యూస్): జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ లో స్వచ్ఛ ప్రతిజ్ఞ చెయ్యడం జరిగింది. మన వాడకి రోజు వచ్చే మున్సిపల్ వాహనానికి తడి, పొడి హానికరమైన చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, స్కూల్ పిల్లలకి మున్సిపల్ ఎన్విరాల్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్ సూచనలు చేశారు.
ఈ సందర్బంగా ఎంఈవో శ్రీనివాస్, ఎన్విరాల్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మీ తల్లి దండ్రులకు తడి, పొడి, హానికరమైన చెత్తపై మీ ఇంట్లో వారికి అవగాహన తీసుకురావాలని తెలిపారు. వేస్ట్ టు వండర్ కంపిటేషన్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకొని చెత్త నుండి నూతన వస్తువులను తయారు చేసి ప్రతి ఒక్కరు 30వ తేదీన పాల్గొని ఉత్తమంగా ప్రదర్శన కనబర్చాలని ఎంఈఓ శ్రీనివాస్ విద్యార్థులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సుధాకర్, మహేష్ , వెంకటేశ్వర్, ఐలయ్య, సారంగపని, రేణుక, రమేష్, హెల్త్ అసిస్టెంట్ మహేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.