కేసీఆర్ హ్యాట్రిక్
సీఎం:దాసోజు శ్రవణ్
- బిఆర్ఎస్ పార్టీ 70 సీట్లకి పైగా గెలుపొంది సింగల్ లార్జస్ట్ పార్టీగా మళ్ళీ అధికారంలో వస్తుంది. కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎం అవుతారు. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్ శాడిస్టిక్ ఆనందం పొందుతోంది. రేవంత్ కాంగ్రెస్ లేకితనానికి పరాకాష్టగా మారింది: బిఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, డిసెంబర్ 2 (విశ్వం న్యూస్): *ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ లేకి తనాన్ని ప్రదర్శిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద బట్టకాల్చి మీదే వేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.
*కాంగ్రెస్ పార్టీ ఎన్ని పెయిడ్ అగ్జిట్ పోల్స్ చేసి, ప్రజలుని అయోమయానికి గురి చేస్తూ పైశాచిక అనందం పొందుతున్నప్పటికీ మా అంచనాలు, సర్వేలు మాకు వున్నాయి. బిఆర్ఎస్ పార్టీ 70 సీట్లకి పైగా గెలుపొంది సింగల్ లార్జస్ట్ పార్టీగా మళ్ళీ అధికారంలో వస్తుంది. ఈ రెండు దఫాలుగా కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి ఉద్యమ ప్రస్థానం మూడోసారి తప్పకుండా కొనసాగుతుంది.
*అవుట్ అఫ్ టర్మ్ లో కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఆరువేల కోట్ల రూపాయిలు బిల్లులు ఇప్పించారని కాంగ్రెస్ పార్టీ ఈసీ కి లేఖ రాయడం వారి చిల్లర లేకితనానికి పరాకాష్ట. ఇది దుర్మార్గమైన తప్పుడు చిల్లర ప్రచారం. రేవంత్ రెడ్డి అంటే దద్దమ్మ. ప్రజాస్వామ్య పద్దతులు, ప్రోటోకాల్ తెలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు ఇలాంటి చిల్లర లేఖపై ఎలా సంతకం పెట్టారు? ఇది ముమ్మాటికీ బ్యూరోక్రసిని, ఈసీని అవమానించడమే. *రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేస్తున్న లేకి ప్రచారాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. *కర్నాటక గెద్దలు, ఏపీ నుంచి పచ్చపార్టీ గెద్దలు, ఢిల్లీగెద్దలు తెలంగాణని కమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. భావన నియంత్రణకు గురి చేసి తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మనందరం జాగ్రత్తగా ఉందాం. రేపు బిఆర్ఎస్ పార్టీ గెలవనుంది. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
‘’పోలింగ్ పూర్తయి ఇంకా నలఫై ఎనిమిది గంటల కాలేదు. ప్రజల తీర్పు ఈవీఎం లో నిక్షప్తమైవుంది. తీర్పు రేపు బయటపడుతుంది. కానీ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ లేకి తనాన్ని ప్రదర్శిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద బట్టకాల్చి మీదే వేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఫలితాలు రాకుండానే పోర్టు పోలియోలా పంచాయితీలు పెట్టుకొని లేకితనాన్ని చూపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని పెయిడ్ అగ్జిట్ పోల్స్ చేసిన ప్రజలుని అయోమయానికి గురి చేస్తూ పైశాచిక అనందం పొందుతున్నప్పటికీ మా అంచనాలు, సర్వేలు మాకు వున్నాయి. బిఆర్ఎస్ పార్టీ 70 సీట్లకి పైగా గెలుపొంది సింగల్ లార్జాస్ట్ పార్టీగా మళ్ళీ అధికారంలో వస్తుంది. ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రెండు దఫాలుగ్వా వారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి ఉద్యమం ప్రస్థానం మూడోసారి తప్పకుండా కొనసాగుతుంది. ప్రజల హితం కోసం కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తారు’’ అని పేర్కొన్నారు బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్.
ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘’కేసిఆర్ గారికి తెలంగాణ ప్రజలకు పేగు బంధం. 14 ఏళ్ళు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. పోరాడి తెలంగాణ సాధించిన నాయకుడు తెచ్చిన తెలంగాణని దేశంలో ఎక్కడాలెన్ని గొప్ప అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు నడిపారు. రెండు దఫాలు అధికారం చేపట్టినప్పటికీ విభజన చట్టాన్ని అమలు చేసి కుదురుకోవడానికే రెండేళ్ళు సమయం పట్టింది. తర్వాత రెండేళ్ళు కరోనాలో పోయింది. తర్వాత రెండు సార్లు ఎలక్షన్ కోడ్ అమలుకు ఆరు నెలలు పోయింది. టెక్నికల్ గా చూసుకుంటే గవర్నమెంట్ పిరియడ్ ఐదున్నర ఏళ్ళు. ఇంత తక్కువ సమయంలోనే కేసీఆర్ గారు చేసినంత గొప్ప అభివృద్ధి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అలాంటి అద్భుతమైన ముఖ్యమంత్రిని చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు తప్పకుండా మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. పెద్దపెద్ద కాంగ్రెస్ నాయకుల అడ్రస్సులు కూడా ఈ ఎన్నికల్లో గల్లంతు కానున్నాయి’’ అని పేర్కొన్నారు దాసోజు
‘ఎగ్జిట్ పోల్స్, ఎక్సయిట్ పోల్స్ కి ఎప్పుడూ తేడా వుంటుంది. 2 కోట్ల 32 లక్షల మంది ఓట్లు వేస్తె 26వేల మంది సాంపిల్స్ తెచ్చి తెలంగాణ మొత్తం ఇలా వుందని థ్రిల్లర్స్ పోల్స్ మాదిరిగా ప్రజలని అయోమయంలోకి నెట్టేసి రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పైశాచిక ఆనందం పొందవచ్చు గాక, కానీ వాస్తవం కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో వున్నారు. తప్పని సరిగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు’అని ధీమా వ్యక్తం చేశారు
‘’కాంగ్రెస్ పార్టీ లేకితనానికి పరాకాష్టగా మారింది. ప్రజలు తీర్పుప్రకారమే ఎవరైనా అధికారంలోకి వస్తారు. కానీ ఇంకా తీర్పు రాకుండానే రేవంత్ కాంగ్రెస్ చాలా లేకిగా వ్యవహరిస్తుంది. కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేస్తున్నారని, రేవంత్ ఇంటి వద్ద భద్రత పెరిగిందని, కొత్త సున్నాలు వేస్తున్నారని సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేయిస్తున్నారు రేవంత్. కాంగ్రెస్ లేకి తనాన్ని తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలి’’అని కోరారు
‘’నాలుగున కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఎలా పెడతారని సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్య పద్దతులు తెలుసా ? ఫలితాలుతో నిమిత్తం లేకుండా ఏ ముఖ్యమంత్రి అయినా క్యాబినెట్ సమావేశం పెట్టాలి. దానికి సాంప్రదాయాలు వున్నాయి. పద్దతి ప్రకారమే తర్వాత కార్యక్రమాలు జరుగుతాయి. దీంతో పాటు ఈ టర్న్ జనవరి 16వరకూ వుంది. ఇంతమాత్రం సోయిలేకుండా రేవంత్ రెడ్డి చిల్లర మాటలాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అంటే దద్దమ్మ. అయనికి ఏం తెలీదు. నోటికొచ్చినట్లు వాగుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి నాయకులు మంత్రులుగా చేశారు. స్పీకర్స్ గా పని చేశారు. కనీసం మీరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెయకూదని మందలించాలి కదా’’ అని సూచించారు దాసోజు.
‘అవుట్ అఫ్ టర్మ్ లో కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఆరువేల కోట్ల రూపాయిలు బిల్లులు ఇప్పించారని కాంగ్రెస్ పార్టీ ఈసీ కి లేఖ రాయడం వారి చిల్లర లేకితనానికి పరాకాష్ట. ఇది దుర్మార్గమైన తప్పుడు చిల్లర ప్రచారం. రేవంత్ రెడ్డి అంటే తుత్తర మనిషి. ఆయనకి విషయపరిజ్ఞానం లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఏమైయింది. పెద్దపెద్ద పదవుల్లో పని చేశారు కదా.. ప్రోటోకాల్స్ పై అవగాహన వున్నా మీరు కూడా ఈ చిల్లర లేఖపై సంతకం చేయడం ఏమిటి ? ఇది ప్రభుత్వ అధికారులని, ఈసీని అవమానించినట్లే. ఎన్నికల నగారా మోగిన తర్వాత పాలన ఎలక్షన్ కమీషన్ కంట్రోల్ లో వుంటుంది. చీఫ్ ఎలక్షన్ కమీషన్ అద్వర్యంలో బ్యూరోక్రసీ నడుస్తుంది. ఇంతమాత్రం సోయి లేకుండా ఇలాంటి చిల్లర లేఖలు రాస్తూ మిమ్మల్ని మీరు దద్దమ్మలుగా చేసుకుంటున్నారు’ అని మండిపడ్డారు దాసోజు.