గొప్ప మనసు చాటుకున్న
చింతపల్లి వంశీ మోహన్ రెడ్డి
- అభినదించన
డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 12 (విశ్వం న్యూస్) : శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గల శివాలయము నిర్మించి దాదాపుగా 15 సంవత్సరాలు ధ్వజస్తంభం లేకుండానే పూజా కార్యక్రమంలో జరుగుతూ వచ్చాయి. ఇది గమనించిన చింతపల్లి వంశీ మోహన్ రెడ్డి కమిటీ సభ్యుల అభ్యర్థుల మేరకు తాను గొప్ప మనసు చేసుకొని పరిసర ప్రాంతీయులకు మార్గదర్శకులుగా నిలబడి తనకు తానే ధ్వజస్తంభం ఏర్పాటు చేయడమే కాకుండా నిన్న శివరాత్రి చివరి రోజైన సోమవారం ధ్వజస్తంభ నిర్మాణంతోపాటు బలిపీఠం అలాగే భక్తజనానికి మేలుకొల్పు సూచనగా ఆకాశదీపమును కూడా తన కుటుంబ సభ్యుల తోటి జ్యోతి వెలిగించి ముందు తరాల వారికి సేవా మార్గాన్ని భక్తిశ్రద్ధలను చాటి చెప్పిన వంశీ మోహన్ రెడ్డి గారికి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి అభినందనలు తెలియజేశారు.
అలాగే ఆలయ ప్రాంగణంలో చాలా అభివృద్ధి పనులు జరగాల్సి ఉన్నవి వాటిని కూడ భక్తులు ముందుకు వచ్చి తమకు నచ్చిన, తోసిన విరాళాలు అందించి ఆలయాల అభివృద్ధికి తోడు పడతారని అలాగే వంశీ మోహన్ రెడ్డి అందించిన సేవా దృక్పథానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీపారాధన కావించడం జరిగింది.
ఈ కార్యక్రమములో చింతపల్లి శోభా రెడ్డి, డాక్టర్ బి .కే. విజయలక్ష్మి, జి కళ్యాణ్ రెడ్డి, జి. మహేందర్ రెడ్డి, జి.రేణుక రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు డి. రవి గౌడ్, రాధిక మరియు అశేష భక్త జనాలు పాల్గొన్నారు.