సీఎం రేవంత్ రెడ్డితో గ్రేటర్
మేయర్ విజయలక్ష్మి భేటీ
- జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు మేయర్ వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విశ్వం న్యూస్) : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం, సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్దికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు మేయర్ వినతి చేశారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్ సమావేశం, బల్దియా ఆర్థిక పరిస్థితిపై రేవంత్‌తో చర్చించారు.
కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కార్పొరేటర్లు హైకోర్టుకు వెళ్ళినట్లు సీఎం దృష్టికి మేయర్ తీసుకెళ్లారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని మేయర్ విజయలక్ష్మి కోరారు. కాగా, సీఎంతో బీఆర్ఎస్ నేతల వరుస భేటీలు గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.