మంత్రిని కలిసిన 317 జీవో బాధితులు

మంత్రిని కలిసిన
317 జీవో బాధితులు

317 జీవో బాధితులు చేసిన విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, మార్చి 10 (విశ్వం న్యూస్) : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని గత ప్రభుత్వ పాలన లో విడుదల చేసిన 317 జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కుంటున్న బాధితులు హైదరాబాదులోని తన నివాసంలో కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా 317 జీవో బాధితులు మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి తమ సమస్యల పరిష్కారంపై రూపొందించిన వినతి పత్రాన్ని సమర్పించారు. గత ప్రభుత్వం నిరంకుశంగా, అసంబద్ధ నిర్ణయాలతో ఉద్యోగుల స్థానికతను గుర్తించకుండా, జోనల్ వ్యవస్థ ను తీసుకొచ్చి తమ జీవితాలతో చెలగాటం అడుకున్నారని మంత్రికి వెల్లడించారు. గత ప్రభుత్వం నిరంకుశ పాలన , అస్తవ్యస్త విధానాలతో ఉద్యోగులను, కుటుంబాలను అనేక ఇబ్బందులకు గురిచేశారని మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి బాధితులు మొరపెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో పై ఏర్పాటు అయిన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా దామోదర రాజనర్సింహ గారిని నియమించినందుకు బాధితులు తమకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

317 జీవో బాధితులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని సమర్పించి తమకు న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకునే నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ఉద్యోగులు , వారి కుటుంబాలతో పాటు తమ స్థానికత, పదోన్నతులు, బదిలీలు, స్పౌజ్ కేసుల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. 317 జీవో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ లో బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా చర్చిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ బాధితులకు భరోసానిచ్చారు.

317 జీవో బాధితులు చేసిన విజ్ఞప్తి పై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యలను క్యాబినెట్ సబ్ కమిటీ లో అధ్యయనం చేసి న్యాయం చేస్తామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో పునర్ సమీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు వెన్నంటి నిలుస్తుందన్నారు.

మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని కలిసిన వారిలో 317 బాదితులు రాపోలు శేఖర్, నిరీక్షణ, దీపిక, అనిత, గుగులోత్ మధు, రాథోడ్ కిరణ్, ఆలూరు మంజుల, పల్లవి లతోపాటు పలువురు బాధితులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *