
- ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం
హైదరాబాద్, మార్చి 15 (విశ్వం న్యూస్) : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
- ఈరోజు రాత్రి 8.45 విమానంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి డిల్లీ తరలించనున్నారు..
కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. అయితే.. సోదాల్లో భాగంగా.. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం.

లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె వాంగ్మాలాన్ని రికార్డు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. చివరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.
