మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ఆవేశం స్టార్

పొన్నం ప్రభాకర్
ఓ ఆవేశం స్టార్

  • దానం ఎమ్మెల్యే పదవి రద్దు చేయండి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్, మార్చి 23 (విశ్వం న్యూస్) : దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో దానం నాగేందర్ పేరు ఉందని ఈ క్రమంలో దానం నాగేందర్ను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన అవసరం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఉందని వెంటనే దానం నాగేందర్ పై వేటు వేయాలని సూచించారు. దానం నాగేం దర్ విషయంపై ఇటీవల స్పీకర్ను కూడా కలిశామని స్పష్టం చేశారు.

ఇటీవలే కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడియో లీక్ అయిందని దానిలో హుజురాబాద్ నియోజకవర్గం తరఫున ప్రజలు తనను ఎన్నుకున్నప్పటికీ కల్యాణ లక్ష్మి చెక్కులు పంచకుండా చేయడానికి హుజురాబాద్ ఆర్డిఓ ఎమ్మార్వోలకు ఫోన్ చేసి బెదిరించడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి పొన్నం తీరు మార్చుకోవాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలి బాగాలేదని… ఆర్డీవోర్డీ మీద సీఎస్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడం మంచి పద్దతిద్ద కాదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆర్డీవోర్డీ ను బదిలీ చేయడం కంటే మంత్రినే ఎందుకు బర్తరర్తఫ్ చేయకూడదు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. కరీంనగర్ గడ్డమీడ్డ ద నుంచి మంత్రి పొన్నం కు సవాల్ విసురుతున్నా నని అసలు ఆర్డిఓర్డి కు తనకు ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదని…ప్రభుత్వం మీదే కదా తనకు ఆడియోకు ఫోన్ కాల్ సంభాషణ జరిగిందో లేదో తేల్చాలని డిమాండ్ చేశారు.

ఆడియో లీక్ చేసింది ఆర్డీవో కాదని మంత్రి ఆఫీస్ నుంచే ఆడియో లీక్ అయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి ఆఫీస్ నుంచి లీకైన సంభాషణకు అమాయకులైన ఆర్డీవోర్డీ ఎమ్మార్వో ల పైన కక్ష సాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి విషయంలో ఆవేశానికి లోను అవుతున్నారని ప్రజలతో మాట్లాడే తీరు కూడా బాగాలేదని అందుకే ఇకనుంచి ఆయనకు ఆవేశం స్టార్ అని బిరుదు కేటాయిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *