హైదరాబాద్ లో సీఎంను కలిసిన
మున్నూరు కాపు నాయకులు
హైదరాబాద్, మార్చి 27 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్ లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో మున్నూరు కాపు నాయకులు, కులస్తులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనం తరం మున్నూరు కాపు సంఘం విద్యార్థి వసతి గృహం నిర్మాణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సంద ర్బంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ… మున్నూరు కాపుల సమస్యల పరిష్కారం కోసం, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం ట్రస్టు భవన నిర్మాణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేసి కోరడం జరిగిందని, మున్నూరు కాపు కులస్తుల సమస్యలు, అభ్యర్థనలు, సంఘం అభివృద్ధికి నిధులపై సీఎం సానుకూలంగా స్పందిం చి, ప్రత్యేక నిధులు మంజూరు చేసి మున్నూరు కాపు సంఘం వసతి గృహాల భవన నిర్మాణాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలం గాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ పటేల్, మున్నూరు కాపు సంఘం రాష్ట్రం ఈసీ మెంబర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కో-ఆర్డి నేటర్ వాసాల రాజు పటేల్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం జాయింట్ సెక్రెటరీ వాసాల వెంకటేశ్వర్లు పటేల్, సంఘం మాజీ అధ్యక్షులు మంగళారపు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి వాసాల శ్రీనివాస్ పటేల్, శ్రీకృష్ణనగర్ మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి వాసాల తిరుపతి పటేల్, శ్రీమూర్తి శ్రీనివాస్ పటేల్, కరీంనగర్ మున్నూ రు కాపు సంఘం ట్రస్ట్ బోర్డు మెంబర్లు బొమ్మ పవన్ కుమార్ పటేల్, వాసాల హరీష్ పటేల్, మడం శివకాంత్ పటేల్, కర్ర రాజశేఖర్ పటేల్, చింతల కిషన్ పటేల్, మహిపాల్ పటేల్, కోల అన్నారెడ్డి పటేల్ తో పాటు నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.