ఏవి తల్లీ నిరుడు కురిసిన ఆ సంక్షేమ సమూహములు… ఎక్కడమ్మా ?

ఏవి తల్లీ నిరుడు కురిసిన ఆ సంక్షేమ
సమూహములు… ఎక్కడమ్మా ?

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్): గత తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆశయం మేరకు తెలంగాణలోని బ్రాహ్మణుల స్వతోముఖాభివృద్ధికొరకై 18 మంది సభ్యులతో కూడిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం కే.వి.రమణాచారి గారి సారథ్యంలో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలుగా ప్రగతి రథం సాగేలా అనేక పథకాలను పరిషత్తు ప్రవేశపెట్టింది. తక్షణ అవసరాలను తీర్చే నిమిత్తం సంక్షేమ పథకాలు, దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసమై అభివృద్ధి పథకాలు రూపొందించబడినవి.

  1. వివేకానంద విదేశీ విద్యా పథకం: విదేశాలలో (యు ఎస్ ఏ, యు కె. ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రాన్స్ మరియు దక్షిణ కొరియా) ఉన్నత విద్యను (పి.జి.పి.హెచ్.డి.) అభ్యసించగోరు అర్హులైన బ్రాహ్మణ పట్టభద్రులకు ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందించే పథకం. కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించని తెలంగాణకు చెందిన బ్రాహ్మణ పట్టభధ్రులు. ఒక కుటుంబం నుండి ఒకరు మాత్రమే అర్హులు.
  2. శ్రీ రామానుజు ఫీజు రీఇంబర్స్ మెంట్ పథకం: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియేట్ అ పై కోర్సులలో చదువును కొనసాగించుటకు వీలుగా తాము విద్యాలయాలలో చెల్లించిన ఫీజును రీఇంబర్స్ చేసే ఆర్థిక పథకం. తెలంగాణకు చెందిన పేద బ్రాహ్మణ విద్యార్థులు. (పట్టణ ప్రాంతములో కుటుంబవార్షిక ఆదాయం రూ.2.00 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతములో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు ఉన్న వారు)
  3. వేద పాఠశాలలకు ఆర్థిక సహాయం: సాంప్రదాయ విద్యకు ఆదరణ, గౌరవం కరువవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని వేద పాఠశాలలకు ఆలంబనగా రూ. 2.00 లక్షలు ఆర్థిక సహాయం అందించే పథకం.
  4. వేద శాస్త్ర పండితులకు గౌరవ భృతి: సాంప్రదాయ విద్యకు ఆదరణ, గౌరవం కరువవుతున్న నేపథ్యంలో తెలంగాణ లోని వేద/ శాస్త్ర విద్యలలో నిష్ణాతులై 75 సంవత్సరాలు పైబడిన వారికి రూ.2,500/- నెలసరి గౌరవం భృతి ఇచ్చే పధకం.
  5. వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం: తెలంగాణలోని వేద విద్యను అభ్యసించే విద్యార్థులుకు ప్రోత్సాహకంగా నెలకు రూ.250/ – స్టెపెండుగా ఇచ్చే పధకం. స్మార్తం పూర్తి చేసిన విద్యార్థులకు జీవనోపాధి కొరకు రూ.3.00 లక్షలు ఆర్ధిక సహాయం చేసే పధకం. అలాగే ఆగమం, క్రమాంతం మరియు ఘనాంతం విద్య పూర్తి చేసిన వారికి రూ. 5.00 లక్షలు ఆర్ధిక సహాయం చేసే పధకం.
  6. ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం: తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా బీద బ్రాహ్మణులకు స్వయం ఉపాధిని కల్పించే విధంగా మరియు వ్యాపార, పారిశ్రామిక రంగాలలో రాణించేలా ఆర్థిక చేయూతనిచ్చే పథకం.

కుటీర పరిశ్రమలకు కనీస విద్యార్హత 10వ తరగతి, వార్షిక కుటుంబ ఆదాయ పరిమితి: పట్టణ ప్రాంతములో రూ.2.00 లక్షలలోపు, గ్రామీణ ప్రాంతములో రూ.1.50 లక్షల లోపు. 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరముల వరకు, వ్యవసాయాధారితరంగానికి 60 సంవత్సరాల వరకు ఉండవచ్చును.

ప్రాజెక్ట్ విలువ— ——-సబ్సిడీ
రూ. 1.00 లక్షలోపు- —80%
రూ.1.00 లక్ష నుండి రూ.2.00 లక్షలలోపు– –70%
రూ.2.00 లక్ష నుండి రూ.12.00 లక్షలలోపు- –60%
(ప్రాజెక్ట్ విలువ రూ.12.00 లక్షలకు మించరాదు)- –(సబ్సిడీ గరిష్ట పరిమితి రూ. 5.00 లక్షలకుమించకుండా)

  1. విప్రహిత బ్రాహ్మణ సదనం: సాంస్కృతిక, సాంప్రదాయక, సామాజిక, వైదిక పరమైన మరియు బ్రాహ్మణ సమాజ హిత కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని వసతులతో కూడిన భవన నిర్మాణానికై ఉద్దేశించిన పధకం. భవన నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో గరిష్టంగా 75% పరిషత్తు భరిస్తుంది. మిగిలినది దాతలు లేదా స్థానిక బ్రాహ్మణ సమాజం భరించవలెను. ఒక ఎకరానికి తక్కువ కాకుండా ఉచిత పద్ధతిన పరిషత్తుకు భూయాజమాన్య హక్కులు కల్పించిన సందర్భంలో బ్రాహ్మణ సదనం పధకం క్రింద పరిషత్ పైన పేర్కొన్న ఖర్చు భరిస్తుంది.
  2. అక్షయ నిధి: తెలంగాణాలోని సామజిక సేవాదృక్పధం వున్న దాతల నుంచి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు విరాళాలు స్వీకరించి వాటిని తిరిగి బ్రాహ్మణుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది.
స్కాలర్ షిప్ తీసుకున్న విద్యార్థిని

ప్రస్తుత ప్రభుత్వం తీరుతో తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఓ క్లారిటీ ఉన్న బ్రాహ్మణులకు ఇప్పుడు ఎం చేయాలో తోచని పరితితిలో ఉన్నారు. అందుకు కారణం ప్రభుత్వం మారడమే. ప్రభుత్వం మారినా సమస్యలు పరిష్కారం అవుతాయన్న భరోసా రాకపోవడమే. ఇప్పుడంతా వందలాది వేలాది కుటుంబాల ఎదురుచూపులే మిగిలాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బ్రాహ్మణులకు దిక్కుగా ఉన్న ఏకైక సంస్థ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. ఇప్పుడా పరిషత్ ఉంది అధికారులు ఉన్నారు, సిబ్బంది ఉంది. కానీ నిధులు లేవు. విదేశీ విద్యా పథకం కింద విదేశాల్లో చదువులకు వెళ్ళిన బ్రాహ్మణ విద్యార్ధులు కష్టాలు పడుతున్నారు. సకాలంలో డబ్బులు చేతికందక తల్లిదండ్రులు అప్పులకోసం తల్లడిల్లుతున్నారు. విదేశాల్లో ఉన్నత చదువులకోసం పరిషత్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగిన వివేకానంద ఓవర్ సీస్ స్కీంలో లబ్దిదారులుగా ఎంపికైన వందలాదిమంది విద్యార్ధులు వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిన విద్యార్ధులకు అప్పటి ప్రభుత్వం పది లేదా ఇరువై లక్షల రూపాయలు గ్రాంటుగా అందించింది.

ఇలా గ్రాంటు పొందిన ఎందరో విదేశాల్లో, స్వదేశాల్లో ఉన్నతమైన కంపనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి బాటలోనే తర్వాత ఎన్నో బ్యాచ్ లు ఎంపికై విదేశాలకు వెళ్ళిపోయాయి. వెళ్ళిన వారిలో చాలా మందికి ఫస్ట్ సెమిస్టర్ ఫీజులు రాగా ఇంకా చాలా మందికి ఒక్క పైసా కూడా అందలేదు. పరిషత్ నుంచి డబ్బు వస్తుంది కదా అంటూ అప్పులు చేసి పంపిచినవారు తిరిగి అప్పులకోసం తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం మారడంతో పాటు నిధులు మంజూరు కాకపోవడంతో గతంలో ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధానంగా ఎందరో బ్రాహ్మణులు అనేక స్కీంలలో లబ్ది పొందక ఇబ్బందులు పడుతున్న విదేశాల్లో ఉన్న విద్యార్ధుల పరిస్థితి వారి కుటుంబీకులు పడుతున్న కష్టాలు మాత్రం ఎవరికీ కనిపించడం లేదు.

మార్పు అంటే ఉన్నది మరింత అభివృద్ధి చెందాలి కాని.. ఊడ్చి పెట్టుకపోయిన చందాన తయారయింది పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పరిస్థితిని సమీక్షించి ఆదుకోవాలని కోరుచున్నాను !!! మంత్రి శ్రీదేవి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *