వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్
అభ్యర్థిగా డా.సుధీర్ కుమార్

వరంగల్, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరా అనే ఉత్కంఠకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెరదించారు. డా. మారేపల్లి సుధీర్ కుమార్ను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా వాసి అయిన డా. సుధీర్ కుమార్ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలోర్టీ క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరొందారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరగ్గ మంచి మార్కులు ఉండటంతో ఆయనను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా
నియమించారు. ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా డా.సుధీర్ కుమార్ పనిచేస్తున్నారు. అయితే వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన నేతలే అభ్యర్థులుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి
వెళ్లినళ్లి ఆరూరి రమేశ్ బరిలో నిలిచారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ కన్ఫామ్ చేసుకున్న తర్వా త పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అనంతరం కాంగ్రెస్ పార్టీలోర్టీ చేరారు కడియం కావ్య.
వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.